Sunday, March 22, 2026

పంత్‌ అద్వితీయమైన సెంచరీ.. ఆధిక్యంలో భారత్‌

క్రీజులోకి వచ్చినప్పుడు రోహిత్‌తో కలిసి భారీ భాగస్వామ్యం నిర్మించడమే ప్రణాళిక అని అనుకున్నట్లుగా టీమ్‌ ఇండియా యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్‌ తెలిపాడు. పిచ్‌ను అర్థం చేసుకున్న తర్వాత తనవైన షాట్లు ఆడాలని  నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టు రెండోరోజు ఆట ముగిసిన తర్వాత రిషబ్‌ మీడియాతో మాట్లాడాడు. రిషభ్‌ పంత్‌ అద్వితీయమైన సెంచరీతో నాలుగో టెస్టుపై టీమ్‌ఇండియా పట్టు బిగించిన సంగతి తెలిసిందే.

రిషభ్‌ పంత్‌ శతకానికి తోడు వాషింగ్టన్‌ సుందర్‌ అర్ధశతకం తోడవ్వడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలుత ఆచితూచి ఆడిన పంత్‌ అర్థశతకం తర్వాత ఇంగ్లీష్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ముఖ్యంగా అండర్సన్‌, బెన్‌స్టోక్స్‌ బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాదాడు. ఆట అనంతరం తన గేమ్‌ ప్లాన్‌ను మీడియాకి పంత్‌ తెలిపాడు.

ఆయన మాట్లాడుతూ.. ”బౌలర్లు మంచి బంతులేస్తే గౌరవించి సింగిల్స్‌ తీయాలని అనుకున్నాను. పరిస్థితులకు తగ్గట్టు ఆడాలనుకున్నా. బంతిని చూసి స్పందించాలన్నది నా లక్ష్యం. 206 పరుగులు చేయడం జట్టు తొలి లక్ష్యం. ఆ తర్వాత వీలైనన్ని పరుగులు సాధించడం. రివర్స్‌ ఫ్లిక్స్‌ ఆడాలంటే సాధన చేయాల్సిందే. అదృష్టం మనవైపుంటే ఇంకా బాగుంటుంది. చాలాసార్లు స్వేచ్ఛగా షాట్లు ఆడేందుకు అనుమతి లభిస్తుంది. అయితే నేను పరిస్థితులను గ్రహించి ముందుకు సాగాల్సి ఉంటుంది. జట్టును విజయాల బాటలో నడిపించేలా చేయడమే నా లక్ష్యం. దాంతో అభిమానుల్ని రంజింపచేస్తే అదే ఆనందం” అని పంత్‌ చెప్పుకొచ్చాడు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -