Sunday, March 22, 2026

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం.. సాగర్‌ డ్యాం వద్ద భారీ భద్రత

రైతుల అవసరాలను పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని ఏపీ మంత్రులు పేర్ని నాని, అనిల్‌ కుమార్‌ మీడియా సమావేశంలో ఆరోపించిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా నేడు జరిగిన ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రధానికే లేఖలు రాయాలని మంత్రులకు సూచించడం, వారు కూడా అంశంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు లేఖలు రాస్తామని హెచ్చరించడంతో వాతావరణం మరింత హీటెక్కింది.

మరో వైపు .. ఎన్జీటీ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వద్దని చెప్పినా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూనే ఉంది.

దీంతో గత కొద్ది రోజులుగా ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర ఆరోపణ, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే నాగార్జునసాగర్‌ జలాశయం వద్ద నల్గొండ జిల్లా పరిధిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించి కాపలా కాస్తున్నాయి.

నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ సాగర్‌ జలాశయాన్ని గురువారం పరిశీలించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు.

విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం వద్ద ఎస్పీఎఫ్‌ సిబ్బందితో పాటు ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్‌ఐలు, 100 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టామని పోలీసు అధికారులు తెలిపారు.

అలాగే ఏపీ-తెలంగాణ అంతర్‌ రాష్ట్ర సరిహద్దు వద్ద కూడా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పోలీసుల అధికారులు వెల్లడించారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -