Monday, March 23, 2026

స్లో ఓవర్ రేట్‌పై బీసీసీఐ కఠిన చర్యలు.. ఇక నిషేధమే..!

ఐపీఎల్‌ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సాఫ్ట్‌ సిగ్నల్‌ తొలగింపు, షార్ట్‌ రన్‌పై థర్ఢ్‌ అంపైర్‌ కన్ను, 90 నిమిషాల్లోనే ఒక ఇన్నింగ్స్‌ పూర్తి చేయడం( 20 ఓవర్లు) లాంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రూల్స్‌ అన్ని ఈ సీజన్‌ ప్రారంభం నుంచే అమలుకానున్నాయి. తాజాగా స్లో ఓవర్‌రేట్‌ను నియంత్రించడం కోసం కూడా బీసీసీఐ మరో కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చింది.

స్లో ఓవర్‌రేట్‌ కారణంగా కొన్ని మ్యాచ్‌లు అనుకున్న సమయానికి పూర్తి కావడం లేదు. ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని అనుకుంటున్న నేపథ్యంలో స్లో ఓవర్ రేట్ నమోదు చేసే జట్లకు భారీ జరిమానాలు విధించేందుకు నిర్ణయించింది.

కొత్త ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం.. ఒక జట్టు మొదటిసారి స్లోఓవర్‌ రేటు నమోదు చేస్తే సదరు జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించనుంది. రెండోసారి అదే తప్పు చేస్తే.. కెప్టెన్‌కు రూ. 24 లక్షల జరిమానాతో​ పాటు జట్టులోని సభ్యులందరి ఫీజులో రూ. 6 లక్షలు లేదా 25 శాతం కోత విధించడం జరుగుతుంది. అయితే ఇక్కడ కెప్టెన్‌కు మినహాయింపు ఉంటుంది.

మూడోసారి అదే తప్పు రిపీట్‌ అయితే మాత్రం కెప్టెన్‌కు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్‌ నిషేదం పడనుంది. దీంతో పాటు జట్టు సభ్యులందరి మ్యాచ్‌ ఫీజు నుంచి రూ.12 లక్షలు లేదా 50శాతం కోత విధించేందుకు బీసీసీఐ సిద్ధమైంది.

అయితే ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభం కానుండగా మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, ఆర్‌సీబీ తలపడేందుకు సిద్ధమవుతున్నాయి.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -