Tuesday, April 8, 2025

డేంజర్ నుంచి తప్పించుకున్న ధోనీ.. ఈ సారి ముందుగానే..

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ తరువాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ పెద్ద డేంజర్ నుంచి తప్పించుకున్నాడు. మ్యాచ్ నిషేధం అయ్యే పరిస్థితి నుంచి ధోనీ బయటపడడంతో చెన్నై అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఐపీఎల్ 14 సీజన్లో రూల్స్ అన్నీ పటిష్ఠంగా అమలు చేస్తామని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పింది. ముఖ్యంగా స్లో ఓవర్ రేట్ నమోదు చేసే జట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 90 నిమిషాల్లోపు 20 ఓవర్లు పూర్తి చేయాలని స్పష్టంగా తెలిపింది. ఈ క్రమంలోనే జట్లన్నింటికీ పటిష్ఠ ఆదేశాలు జారీచేసింది.

కాగా.. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై ఓడింది. ఓటమి విషయం అటుంచితే ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోనీపై భారీ ఫైన్ విధించింది బీసీసీఐ. మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన కారణంగా.. ధోనీకి రూ.12 లక్షల జరిమానా విధించినట్లు బీసీసీఐ వెల్లడించింది. కొత్త రూల్స్ ప్రకారం.. ఏ జట్టైనా తొలిసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే కెప్టెన్‌కు జరిమానా, రెండో సారి కూడా నమోదు చేస్తే.. ఆ జట్టు కెప్టెన్‌పై ఓ మ్యాచ్ నిషేధం విధించే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే ధోనీ విషయంలో అభిమానుల్లో ఆందోళన చెందారు. అయితే ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయం కంటే 20 ఓవర్లు పూర్తి చేసి శభాష్ అనిపించాడు. మరోసారి బెస్ట్ కెప్టెన్ అని నిరూపించుకున్నాడు.

ఇదిలా ఉంటే పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. తొలుత చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చయడంతో పంజాబ్ 8 వికెట్లకు 106 పరుగులతో ఈ సీజన్లోనే అత్యంత తక్కువ స్కోరు నమోదు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(5) వెంటనే అవుటైనా.. మరో ఓపెనర్ ఫాఫ్ డూ ప్లెసిస్(36 నాటౌట్: 33 బంతుల్లో.. 3 ఫోర్లు, 1 సిక్స్), మొయీన్ అలీ(46: 31 బంతుల్లో.. 7 ఫోర్లు, 1 సిక్స్) చివరి వరకు క్రీజులో పాతుకుపోయి చెన్నైకి విజయాన్ని చేరువ చేశారు. విజయానికి మరో 18 పరుగులు కావల్సి ఉండగా.. మొయీన్ అలీ అవుట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన సురేశ్ రైనా(8: 9 బంతుల్లో.. 1 ఫోర్), అంబటి రాయుడు(0) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. కానీ శామ్ కర్రాన్(5 నాటౌట్: 4 బంతుల్లో.. 1 ఫోర్)తో కలిసి డూ ప్లెసిస్ లాంఛనం పూర్తి చేశాడు. ఈ విజయంతో చెన్నై ఐపీఎల్ 14వ సీజన్లో పాయింట్ల ఖాతా తెరిచింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest


0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x