Sunday, March 22, 2026

పృథ్వీ షాని పక్కా ప్లాన్‌తో అవుట్ చేశా: ఉనద్కత్

ఐపీఎల్ 2021లో భాగంగా గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. చెన్నైపై అద్భుతంగా రాణించిన ఢిల్లీని తక్కువ స్కోరుకే కట్టడి చేసి, బ్యాటింగ్‌లో డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించింది. ప్రధానంగా ఢిల్లీ ఓపెనర్లతో పాటు ఆజింక్య రహానేను కూడా అవుట్ చేసి మొదటి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఢిల్లీ ఓపెనర్లలో కీలకమైన పృధ్వీషా వికెట్‌ కోసం ఓ పక్కా ప్లాన్‌తో బౌలింగ్ వేశానని, దాని ప్రకారమే అతడి వికెట్ తీశానని రాజస్థాన్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ వెల్లడించాడు.

‘చెన్నైతో ఆడినప్పుడు పృధ్వీ ఆట బాగా ఫాలో అయ్యా. ఆ మ్యాచ్‌లో పృథ్వీ ఎక్కువగా గ్రౌండ్‌ షాట్లు ఆడాడు. గత మ్యాచ్‌లో షా ఆడిన ఎక్కువ షాట్లు మిడ్‌వికెట్‌ రీజియన్‌ నుంచి వచ్చాయి. ప్రధానంగా స్లో బాల్స్‌ను అతడు మిడ్‌వికెట్‌ దిశగా కొట్టడానికి అతడు ఇష్టపడతాడు. దానిని దృష్టిలో ఉంచుకునే నా రెండో ఓవర్‌ ఆఖరి బంతిని స్లో బాల్‌గా వేశాను. పృథ్వీ దానిని మిడ్‌వికెట్‌ దిశగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అది బ్యాట్‌ ఎడ్జ్‌కు తగిలి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఉన్న మిల్లర్‌ చేతికి చిక్కడంతో నా ప్లాన్‌ ఫలించింది. అలా షాను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపడంలో సక్సెస్‌ అయ్యానం’టూ ఉనత్కత్ తెలిపాడు.

కాగా.. ఢిల్లీతో మ్యాచ్‌లో మొత్తంగా 4 ఓవర్లు వేసిన ఉనద్కత్.. 15 పరుగులు మాత్రమ ఇచ్చి ఓపెనర్లిద్దరితో పాటు వన్ డౌన్ బ్యాట్స్‌మన్‌‌నూ అవుట్ చేసి మొత్తం 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా మొత్తం 4 ఓవర్లలో ఉనద్కత్ 15 డాట్‌ బాల్స్‌ వేసి ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం పరుగులు చేయకుండా కట్టడి చేశాడు.

ఇక మొదటి మ్యాచ్‌లో నాకు అవకాశం రాలేదు.. అయినా సరే అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని ఎదురుచూశానని, రెండో మ్యాచ్‌లోనే ఒక మంచి స్సెల్‌ వేయడమే కాకుండా కీలక వికెట్లు తీయడం సంతోషం కలిగించిదని ఉనద్కత్ తెలిపాడు. గత సీజన్‌లో పెద్దగా రాణించలేకపోయానని, కానీ ఈ సీజన్‌లో బాగా ఆడాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. కాగా గత సీజన్‌లో ఉనాద్కట్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున 7 మ్యాచ్‌లాడి కేవలం 4 వికెట్లు మాత్రమే తీసి ఘోరంగా విఫలమయ్యాడు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -