ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరగనున్న ఈ టోర్నీ భారత్, న్యూజిల్యాండ్ మధ్య జరగనున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగాల్సిన 5 టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ మండలి పక్కా ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే 20 మంది సభ్యులతో జట్టును కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆటగాళ్లు, కోచింగ్ సహాయ సిబ్బంది అందరూ ఇంగ్లండ్ పర్యటన కోసం వెళ్లే ముందు మే 19న ముంబైలో సమావేశం అవుతారట. అయితే ఈ సమావేం ముందుకు కఠిన నిబంధనలను అమలు చేయనుంది.
కాగా, ఈ ఆటగాళ్లందరూ మూడు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకున్న తర్వాతే ఈ సమావేశానికి హాజరు కావాలని బీసీసీఐ సూచించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా వివరించింది.
‘ఆటగాళ్లంతా తమ తమ ఇళ్ల వద్దే మూడు సార్లు ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేయించుకుంటారు. నెగిటివ్ ఫలితం వచ్చిన తర్వాత మే 19న ముంబైలో ఒక దగ్గరికి చేరుతారు. జూన్ 2న ఇంగ్లండ్‌కు బయల్దేరతారు. అంతకు ముందు ప్రతి ఒక్కరూ భారత్‌లోనే 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు’ అని బీసీసీఐ తెలిపింది.
ఇదిలా ఉంటే మూడు నెలలకు పైగా సాగే ఈ పర్యటన కోసం క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులకు మొత్తం 20 మంది సభ్యులతో జట్టును బీసీసీఐ ప్రకటించింది. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్.. టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరుగుతుంది.