Sunday, March 22, 2026

హర్బజన్‌పై నెటిజన్ ఫైర్.. వాళ్లకే సమాధానమిస్తావా అంటూ..

టీమిండియా మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్బజన్ సింగ్‌పై సోషల్ మీడియాలో ఓ నెటిజన్ తీవ్రంగా విమర్శించాడు. సోషల్‌ మీడియాలో సెలబ్రిటీలకు మాత్రమే సమాధానాలిస్తావెందుకని, సామాన్యుల ప్రశ్నలను కనీసం పట్టించుకోవని భజ్జీని నిలదీశాడు. సామాన్యలు, మధ్య తరగతి ప్రజలతో మాట్లాడేందుకు, వారి పోస్ట్‌లకు రిప్లై ఇచ్చేందుకు భజ్జీ ఏ మాత్రం ఇష్టపడడంటూ ఆరోపణలు చేశాడు. ‘కేవలం ప్రొఫైల్‌పై బ్లూ టిక్‌ మార్క్‌ ఉన్న సెలబ్రిటీలపై మాత్రమే ఆసక్తి ఎందుకు చూపిస్తావ్..?, అందులో ఒక్క శాతం కూడా సామాన్య ప్రజలపై చూపించవు ఎందుకు..?’ అని ప్రశ్నించాడు. ఇదేనా మీకున్న మానవత్వమంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సదరు అభిమాని ఆ స్థాయిలో విమర్శించినా.. భజ్జా మాత్రం చాలా సౌమ్యంగా సమాధానమిచ్చాడు. అతడి ప్రశ్నలకు సానుకూలంగా బదులిచ్చాడు. ‘నేను కూడా దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చాను. పద్ధతిగా సంభాషించే ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. నేను ఏ క్లాస్‌కు చెందినవాడిని కాదు. ఎదుటి వ్యక్తి బాధను అర్ధం చేసుకోగల నీలాంటి సాధారణ వ్యక్తినే. అందులో సందేహం లేదు’ అని సదరు అభిమానికి బదులిచ్చాడు.

ఇదిలా ఉంటే హర్జజన్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంపై ఆయన అభిమానులు కోపంతో రగిలిపోతున్నారు. తమ అభిమాన ఆటగాడు భజ్జీ అలా ఎన్నడూ చేయడని, ప్రతి ఒక్కరితో ఎంతో హుందాగా సంభాషిస్తాడని, అందులో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. సదరు నెటిజన్‌ తప్పుగా భావిస్తున్నాడని, ఇది హర్బజన్ ప్రొఫైల్ చూస్తే అర్థమైపోతుందని, ఒకసారి చెక్ చేసి అప్పుడు ఈ ఆరోపణలు చేయాలని సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే భజ్జీ ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు. అయితే తొలి మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే తుది జట్టులో స్థానం సంపాదించాడు. అయితే ఆశించిన స్థాయిలో రాణించకపోవటంతో జట్టు యాజమాన్యం అతడి స్థానంలో మరొకరికి అవకాశం కల్పించింది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -