Friday, November 1, 2024

ట్విటర్‌లో ఈ పదం టైప్ చేస్తే అంతే.. మీ ఖాతా గోవిందా..!

మీ ట్విటర్ ఖాతా బ్యాన్ అయ్యే ప్రమాదంలో ఉందని మీకు తెలుసా..? ఓ చిన్న పదం టైప్ చేస్తే మీ ట్విటర్ అకౌంట్ బ్యాన్ అయిపోతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పదాన్ని మాత్రం మీ ట్విటర్ ఖాతాల్లో టైప్ చేయకండి. మెంఫిస్ అనే పదం ట్విటర్‌లో షేర్ చేస్తే అంతే. మీ ఖాతా బ్యాన్ అయిపోతుంది. ఇప్పుడు ట్విటర్ యూజర్లను ఇదే భయపెడుతోంది. ఏడు అక్షరాలుండే ఈ పదాన్ని ఉపయోగించి ఎవరైనా ఒక్క ట్వీట్ చేస్తే చాలు వారి ట్విటర్ ఖాతా ఆటోమేటిక్‌గా బ్లాక్ అయిపోతోంది. 12 గంటల పాటు ఆ సస్పెన్షన్ కొనసాగుతోంది. గత వారం అలా ఎన్నో లక్షల అకౌంట్లు బ్లాక్‌ అయిపోయాయట. అమెరికాలోని టెన్నెసే రాష్ట్రంలో గల ఓ ప్రధాన నగరం పేరు `మెంఫిస్`. ఈ నగరాన్ని ట్విటర్ బ్లాక్ చేయడం వివాదాస్పదంగా మారింది.

`మెంఫిస్` అని ట్విటర్‌లో టైప్ చేయగానే.. ఆ ట్వీట్‌ను డిలీట్ చేయమని ట్విటర్ నుంచి వెంటనే మెసేజ్ వస్తుంది. అలాగే ట్విటర్ ఖాతా కూడా బ్లాక్ అయిపోతుంది. దీనిపై ట్విటర్ వివరణ కూడా ఇచ్చింది. ఈ తప్పు తాము కావాలని చేసింది కాదని, బగ్ ఫిక్సింగ్‌లో అనుకోకుండా జరిగిన పొరపాటు వల్ల ఈ తప్పు జరుగుతోందని తెలిపింది. అకౌంట్లు బ్లాక్ అవుతుండడం అందులో భాగమేనని ట్విటర్ అధికారికంగా వెల్లడించింది. బ్లాక్ అయిన అన్ని అకౌంట్లను ఇప్పటికే పునరుద్ధరించినట్లు తెలిపింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x