ఆస్ట్రేలియాలో తొలి మ్యాచ్‌లో పృధ్వీషా ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో అతడిని తరువాతి మ్యాచ్‌కు మేనేజ్‌మెంట్ జట్టుకు తీసుకోలేదు. రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేసింది. ఆ తర్వాత మరో మ్యాచ్‌లో అవకాశం కూడా రాలేదు. అయితే అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన పృధ్వీషా అదరగొట్టాడు. సెంచరీలు బాదేశాడు. ఏకంగా రికార్డు డబుల్ సెంచరీతో ఔరా అనిపించాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పృధ్వీ షా ఆసీస్ సిరీస్ గురించి మాట్లాడాడు.
ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలి మ్యాచ్ తరువాత తనను తీసేయడం చాలా బాధ కలిగించిందని పృధ్వీషా చెప్పాడు. తనను తప్పించిన సమయంలో చాలా ఆవేదనకు గురయ్యానని ఏడుపొచ్చేసిందని చెప్పుకొచ్చాడు. ‘జట్టులో నుంచి నన్ను తీసేశారని తెలియగానే గదిలోకెళ్లి ఏడ్చేశాను. ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. నాకు నేనే ఎందుకూ పనికిరాని వాడిగా కనిపించాను. నా గదిలోకి వెళ్లి బాగా ఏడ్చాను. ఏదో తప్పు చేస్తున్నాను. వెంటనే ఆ తప్పును సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే మరింత శ్రమించానం’టూ పృధ్వీషా వెల్లడించాడు.
ఇదిలా ఉంటే ఆసీస్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ చారిత్రక విజయం సాధించింది. తొలి టెస్టు ఓడిపోయినా ఆ తరువాతి మ్యాచ్ డ్రా చేసుకుంది. చివరి రెండు మ్యాచ్‌లలో అద్భుతమైన ఆటతీరుతో రెండింటిలోనూ విజయం సాధించి సిరీస్‌ను సైతం కైవసం చేసుకుంది. అనంతరం ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ తొలి టెస్టు ఓడిపోయి ఆ తరువాత 3 టెస్టులనూ సొంతం చేసుకుంది.